మనసున ...
దేవులపల్లిగారి ఒక అద్భుతమైన పాటలోని కొన్ని పదాలు.
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని ఘడియయేని ఇక విడిచిపోకుమా ఘడియయేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హౄదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో????......
ఇటువంటి పాటలు, మాటలు ఆ ప్రేమ,విరహం అనుభవించే వ్రాస్తారో లేక ఊహించి వ్రాస్తారో కానీ , ఎంత గొప్పగా వ్రాసారో కదా..