మౌనమే నీ భాష ఓ మూగ మనసా
Movie : గుప్పెడు మనసు
Lyrics: ఆత్రేయ
Singer : బాల మురళికృష్ణ
Music : విశ్వనాథన్ MS
"మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ బాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
కోర్కెల సెగ నీవు
ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యల్లవే మనసా
మాయల దెయ్యానివ్వే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పగిలేవు "
ఎంత అద్భుతమైన పాట ఇది. అద్భుతమైన lyrics. అంతే అద్భుతం గా పాడారు బాలమురళికృష్ణ గారు.
"మౌనమే నీ బాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో "
Hmmm !!!
"ఊహల ఉయ్యల్లవే మనసా
మాయల దెయ్యానివ్వే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పగిలేవు ...."
మనసు ఒప్పుకోటానికి ఇష్టపడని భయంకరమైన నిజాలని ..ఆలొచిస్తేనే గుండెలను పిండేసే ఏదో బాధని మాటల రూపం లో ఎంత బాగా రాసారు..ఎంత బాగా పాడారు..ఎంత బాగా tune చేసారు...
0 comments:
Post a Comment