Thursday, December 11, 2008

Sree rama gaana lahari

Lyrics: SaiKrishna Yachendra
"రామ రామ అంటేనే చాలదా
శ్రీ రామ రామ అంటేనే చాలదా

రాం రాం రాం సీత రాం రాం రాం
రాం రాం రాం సీత రాం రాం రాం

రామ రామ అంటేనే చాలదా
శ్రీ రామ రామ అంటేనే చాలదా
కామితములు తీరగా
తామసములు తొలగగా
రామ రామ అంటేనే చాలదా
శ్రీ రామ రామ అంటేనే చాలదా

నారాయణ మంత్రములో 'రా బీజము
పంచాక్షరి మంత్రములో 'మా జీవము
శ్రీమన్నారాయణ మంత్రములో 'రా బీజము
శివ పంచాక్షరి మంత్రములొ 'మా జీవము
రెండక్షరాల సంపుటి అగు అక్షర బ్రహ్మమైన శ్రీరామ నామమే రాజీవము,ప్రాణ రాజీవము
అవధి లేని భవజలధిని అధికమించ నావ

అది అఙాన తిమిరతతుల అణగించే త్రోవ
సిద్ద శాంతి పొందగా,చిదానందమొందగా
సిద్ద శాంతి పొందగా,చిదానందమొందగా
ఏ తపమూ చేయకయే ఏకాగ్ర సమాధినీయ
రామ రామ అంటేనే చాలదాశ్రీ రామ రామ అంటేనే చాలదా

అశాంతియే అలముకొన్న తరుణములోఆదరించి ఒడిచేర్చే అమ్మ వంటిది
అశాంతియే అలముకొన్న తరుణములోఆదరించి ఒడిచేర్చే అమ్మ వంటిది
ఆవేదన ముసురుకొన్న అన్ని వేళలందున
ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది,నాద బ్రహ్మ వంటిది
ఆవేదన ముసురుకొన్న అన్ని వేళలందున
ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది,నాద బ్రహ్మ వంటిది
రామ రామ అంటేనే చాలదా
శ్రీ రామ రామ అంటేనే చాలదా

రాం రాం రాం సీత రాం రాం రాంరాం రాం రాం సీత రాం రాం రాం"

These are songs from a cassette called Sri rama gana lahari.
Suseela garu sang wonderfully and awesome lyrics by Sai Krishna Yachendra garu.

I grew up listening to these songs and they are so dear to me.

2 comments:

Anonymous January 15, 2009 at 12:12 AM  

Wow what a coincidence, all the songs in this cassette are dear to me, mostly the one "Pavalimpa velaaya purushothama..."

Sravya January 15, 2009 at 10:54 AM  

Cool...yeah that song is my favorite too :).Very soothing music and wonderful lyrics. I am blogging about all the songs in that cassette will blog about it too.

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP