Sree rama gaana lahari - Song 2
Another song from Sree rama gaana lahari...A song where the singer is waiting for him..(Rama) and expresses the way she imagines that every sound that she hears is him....and then when she finds it isn't him...she expresses her disappointment...I just don't know how to express what I feel about these lyrics, music and how it is sung.
"అంతదవుల నుండి కడువింతగని అడుగుల సడి
ఎపుడో వినిపించే రామాఎంతకు అరుదెంచవేమి గుణధామా"
"అది నీ పద ధ్వనియేనా
మదిలోపల ఉదయించిన మధుర భ్రమయేనా
అది నీ పద ధ్వనియేనా
మరి మదిలోపల ఉదయించిన మధుర భ్రమయేనా
అలనల్లన చిరుగాలికి ఆకుల అలజడియేనా
గులక రాళ్ళ పై నడిచే సెలయేటి అలికిడియేనా..."
Wow..Lyrics ని మెచ్చుకోవాలో లేకా ఆ lyrics లో ఉన్న ఆ సున్నిత భావాన్ని అంత గొప్పగా మలిచిన ఆ సంగీతాన్ని మెచ్చుకోవాలో లెకా అంత అందం పాడిన వారిని మెచ్చుకోవాలో మరి..."గులక రాళ్ళ పై నడిచే సెలయేటి అలికిడియేనా..."అని పాడినా తీరు చూడండి...ఎంత disappointment ని ఇట్టే పలికించేసారు...
"అంతదవుల నుండి కడువింతగని అడుగుల సడి
ఎపుడో వినిపించే రామాఎంతకు అరుదెంచవేమి గుణధామా"
ఎంత ఆర్తిగా పాడారో...
"ఆగలేని గంగవోలే అశ్రుధార పొంగేనూ
ఆగలేని గంగవోలే అశ్రుధార పొంగేనూ
ఇక నిను గానక పుడమి పైన నిమిషమైన నిలువలేనూ
నా కనుపాపల ఉండి నల్లనవైతివ దేవా
నా కనుపాపల ఉండి నల్లనవైతివ దేవా
నా ఎదుట నిలిచి నీ కన్నుల నన్ను కరగనీయవా"
రాముడి complexion గురించి ఆ పోలిక చూడండి..."నా కనుపాపల ఉండి నల్లనవైతివ దేవా..." Wow...
"అంతదవుల నుండి కడువింతగని అడుగుల సడి
ఎపుడో వినిపించే రామాఎంతకు అరుదెంచవేమి గుణధామా"
ఎంత సున్నితంగా ఉంది ఈ పాట..What do I even say about this song too...So dear to me !!
1 comments:
can you pls send me those songs?? even i love them a lot.. kaani naa daggara audio cassette is ther.. no mp3 format. do mail them to sarath888@gmail.com. il be waitn
Post a Comment