Sreeraamagaana lahari -4
Another nice song from Sreerama gaana lahari
ఈ పాట వినుమయ్య రామా
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమా
ఈ పాట వినుమయ్య రామా
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమ
అసంకల్పముగా అంతరంగమే
ఆలపించు సంగీతమే సుమా
త్యాగరాజ రాగమృతమెరుగను
రామదాస రసకీర్తన తెలియను
ప్రాణ పంచకము ప్రణవము పలుకగ
పరవశమంది పాడుచుంటుని
రాగము కందని అనురగముతో
తాళము కందని తపోధ్యానముతో
శృతికందని విశృత భక్తితో
గద్గద కంఠము గానము చేశే
ఈ పాట వినుమయ్య రామ
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమా
ఈ పాట వినుమయ్య రామ
మదిలో అశలు తెలుపుట కొరకు
హృదయమందిన గీతము కాదు
క్షణమైనా నా కృతిని వినుట కన్న
నేనాశించు బ్రహ్మానందము లెదు
ఈ పాట వినుమయ్య రామ
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమా
ఈ పాట వినుమయ్య రామ
ఈ పాట వినుమయ్య రామ
0 comments:
Post a Comment