Sunday, January 18, 2009

Sreeraama gaana lahari - 7

Another nice song :

రామ గాన లహరి
రమ్య మంత్రక్షరి
రామ గాన లహరి
రాజ సహరి
రామ గాన లహరి
రాగ మోక్షాకరి
రామ గాన లహరి
రసమయ ఝరి
శ్రీరామ గాన లహరి.....

మహనీయమైనది నీ చరితం
మధుర సుధ రస భరితం
కౌసల్య దసరథ కుమారా
లక్షమణ భరత సత్రుగ్న్య సొదరా
రామ రామా మహనీయమైనది నీ చరితం

చిదిమిన పాల్గారు చిన్నారి ప్రాయమున
గురునాగ్న్యపై అదలికి తరలితివి
రక్కసులని గూల్చి
రాతినాతిగజేసి
శివధనువును విరిచి
సీతను పరిణయమాదితివి
రామా రామా మహనీయమైనది నీ చరితం

పట్టాభిషేకము ప్రభువు తలపగా
కానకు పొమ్మని కైకమ్మ కోరగా
వైదేహి తో గూడి తరలితివి
వైదేహి తో గూడి తరలితివి
భరతుడు ప్రార్థింప పాదుకలొసగి పాలించితివి
రామ శ్రీరామ మహనీయమైనది నీ చరితం
అసురుడు కలిగిని హరియింప కుమిలి
సుగ్రీవాది కపిశ్రేష్ఠుల కలిసి
సీత జాడను ఎరిగి
సేతువు నిర్మించి
దశకంఠుధునువాడి ధరనిజగూడి అయోధ్యనేలితివి
రామా రామా మహనీయమైనది నీ చరితం

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP