Sunday, January 18, 2009

Sreerama gaana lahari -9

Another song from the same album :

శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

మనిషిగ జనియించి
మమతలు విరియించిన
సత్యధర్మ సుందరుడు నిత్య దయమందిరుడు

శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

అన్నగా కనుదమ్ముల తనదమ్ములనే నిలిపెను
పతిగా కులసతినే అతిప్రేమతో వలచెను
సఖ్దైన సుగ్రీవుని సమ్రాట్టుని చేశెను
దాసుడైన హనుమంతుని దైవముగ మలిచెను
శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

బండను పదతిని చేసిన పాదధూళి అతనిది
బోయవాని కవి చేసిన పుణ్య చరితమతనిది
ఎవ్వని కరస్పర్శ తో పావనమాయెను ఉడుత
ఎవ్వని కృప కలిగెంచెను వానరులకు ఘనత
శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

ఆ పదమంటిని పాదుకలు పృధ్విని పాలించెను
అతని దివ్య నామమే అమృత మంత్రమాయెను
అతని రాజ్య పాలన ఆదర్శమై నిలిచెను
అతని పేర ప్రతి ఊరిలో ఆలయమే వెలెశెను
శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో






0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP