సీతా కళ్యాణ వైభోగమే
సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమ వరనేత్ర రమణీయ గాత్ర
భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభి రామ సాకేత ధామ
సర్వ లోకాధార, సమరైక ధీర ,గర్వ మానస దూర, కనకాఘ ధీర
నిగమాగమ విహార, నిరుపమ శరీర ,నగధరాగ విధార నత లోకాధార
పరమేశనుత గీత, భవ జలాధిపోత, తరని కుల సంజాత, త్యాగరాజనుత
0 comments:
Post a Comment