Friday, January 30, 2009

బాల కనకమయ చేల

బాల కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమాలోల విధౄత శరజలా
శుబద కరుణాలవాల ఘన నీల నవ్య వన మాలికా భరణ
ఏలా నీ దయరాదు
పరాకు చేసే వేళా సమయము కాదు

రారా రారా రారా రారా దేవది దేవా
రారా మహానుభావా
రారా దేవాది దేవా
రారా మహానుభావా
రారా దేవాది దేవా
రారా మహానుభావా
రారా రాజీవనేత్రా
రఘువర పుత్రా సారతర సుధా పూర హృదయ
రారా రారా శారతర సుధా పూర హృదయ
పరివార జలధి గంభీర
ధనుజ సమ్హార దశరధ కుమార
బుధ జనవిహార సకల శృతిసార
నాదు పై ఏలా నీ దయరాదు

స రి మ రి స తక తఝుం
గ ప మ ప ద ప ఝుం
స ని రి స తక తఝుం
స ని స ధిం
స ని స రి స ధిం
స ని స గ మ రి
స ని రి స ధిం
ప ద తక ధిమి తక తజుం
ప ప మ రి
మ మ రి స
స రి రి మ
రి మ మ ప
తక ఝం
ప మ గ మ రి
మ రి స రి మ ప
తధిం గినతోం
పా ద ని ప మ
తదిం గినతోం
ఏలా నీ దయరాదు
పారాకు చేసే వేళా సమయము కాదు
ఏలా నీ దయరాదు


I love this keertana and mainly know this from Sagarasangamam.
Very very well sung.
Hmm..ఏలా నీ దయరాదు...నాదు పై ఏలా నీ దయరాదు??? Hmm...

Friday, January 23, 2009

Hauting song

Haunting..well in a good way? I don't know what to say..I loved this song..I don't know how to describe what I feel when I hear this song. Kaise mujhe song from Ghajini.

Get this widget | Track details | eSnips Social DNA

Sunday, January 18, 2009

Here is a song...

Just for you...















Get this widget |Track details |eSnips Social DNA


Happy Birthday
.... .

Sree raama gaana lahari - 10

The last and final song in the album. (I must have messed up the order of the songs that I posted from the order in the cassette but this is the last song in the cassette too ) A very very dear song to me . So soothing, awesome lyrics , deep meaning , so soothing...wow.. Look at all those comparisions and metaphors used :)

పవళింప వేళాయె పురుషొత్తమా
రవ్వంత సేపైనా శయనింపుమా
పవళింప వేళాయె పురుషొత్తమా
రవ్వంత సేపైనా శయనింపుమా
పవళింప వేళాయె పురుషొత్తమా
రామా ...

అసురులను హతమార్చి అలసినావేమో
విశ్రమింపగ నీకు విడి శయ్య ఉన్నది
వెన్నెల తీగలే విరబూయు వేళా
పన్నగ శాయి పానుపు చేరుమా

పుడమినే పాలించి బదలినావేమో
తల వాల్చగా హృదయ తల్పమే ఉన్నది
శ్వాసలే సోహమని సంగీతమే పాడే
క్షణమైన ఎదజేరి కరుణించుమా
పవళింప వేళాయె పురుషొత్తమా
రామా ...

అల నీల గగనమే అడ్డదూలముగ
దిక్కులే గొలుసులుగా ధరణి పీఠముగ
వీచు గాలులు నీకు వీవనులుకాగా
విశ్వమెల్లను నీకు ఉయ్యలాకాగా

పవళింప వేళాయె పురుషొత్తమా
రామా రామా...

Sreerama gaana lahari -9

Another song from the same album :

శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

మనిషిగ జనియించి
మమతలు విరియించిన
సత్యధర్మ సుందరుడు నిత్య దయమందిరుడు

శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

అన్నగా కనుదమ్ముల తనదమ్ములనే నిలిపెను
పతిగా కులసతినే అతిప్రేమతో వలచెను
సఖ్దైన సుగ్రీవుని సమ్రాట్టుని చేశెను
దాసుడైన హనుమంతుని దైవముగ మలిచెను
శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

బండను పదతిని చేసిన పాదధూళి అతనిది
బోయవాని కవి చేసిన పుణ్య చరితమతనిది
ఎవ్వని కరస్పర్శ తో పావనమాయెను ఉడుత
ఎవ్వని కృప కలిగెంచెను వానరులకు ఘనత
శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో

ఆ పదమంటిని పాదుకలు పృధ్విని పాలించెను
అతని దివ్య నామమే అమృత మంత్రమాయెను
అతని రాజ్య పాలన ఆదర్శమై నిలిచెను
అతని పేర ప్రతి ఊరిలో ఆలయమే వెలెశెను
శ్రీరాముని వంటి దైవమెవరు జగములో
ఆరాధ్య పురుషుడతడు ఏ యుగములో






Sreerama gaana lahari -8

Another song from the same album

ఎలా దాచగలనో రామా
ఇంతటి మధురానందం
ఎలా దాచగలనో రామా
ఇంతటి మధురానందం
పిడికెడు గుండెలో
ఎటుల మ్రోయవలె కడలి అంత దివ్యానుభవం

పదే పదే నీ భవ్యరూపము
పారవశ్యమున తిలకించి
మరీ మరీ నీ మంత్రనామము
మనసు తీరగా స్మరియించి
తనువు జగము విస్మరిరించు
ఈ తారాఙ్య వేళలో

పారాత్పరా నీ పాదసేవయని తలిచితిని
అదే పనిగా నీ సన్నిధి నిలిచి ఇదే మోక్షమని ఎంచితిని
అనీ మరిచి ద్వతము వీదిన అద్వైత వేళలో

ఎలా ఎలా ఎలా
ఎలా దాచగలనో రామా




Sreeraama gaana lahari - 7

Another nice song :

రామ గాన లహరి
రమ్య మంత్రక్షరి
రామ గాన లహరి
రాజ సహరి
రామ గాన లహరి
రాగ మోక్షాకరి
రామ గాన లహరి
రసమయ ఝరి
శ్రీరామ గాన లహరి.....

మహనీయమైనది నీ చరితం
మధుర సుధ రస భరితం
కౌసల్య దసరథ కుమారా
లక్షమణ భరత సత్రుగ్న్య సొదరా
రామ రామా మహనీయమైనది నీ చరితం

చిదిమిన పాల్గారు చిన్నారి ప్రాయమున
గురునాగ్న్యపై అదలికి తరలితివి
రక్కసులని గూల్చి
రాతినాతిగజేసి
శివధనువును విరిచి
సీతను పరిణయమాదితివి
రామా రామా మహనీయమైనది నీ చరితం

పట్టాభిషేకము ప్రభువు తలపగా
కానకు పొమ్మని కైకమ్మ కోరగా
వైదేహి తో గూడి తరలితివి
వైదేహి తో గూడి తరలితివి
భరతుడు ప్రార్థింప పాదుకలొసగి పాలించితివి
రామ శ్రీరామ మహనీయమైనది నీ చరితం
అసురుడు కలిగిని హరియింప కుమిలి
సుగ్రీవాది కపిశ్రేష్ఠుల కలిసి
సీత జాడను ఎరిగి
సేతువు నిర్మించి
దశకంఠుధునువాడి ధరనిజగూడి అయోధ్యనేలితివి
రామా రామా మహనీయమైనది నీ చరితం

Srirama gana lahari - 6

Another song which makes you think :)

ఎంత నోము నోచినాము మేమని
మనుషులకంటే తామంతోఇంతో నయమని
పెదవి విప్పి పలికినవి కొన్ని
తమ మదిలోని మాటలన్నీ

వెదురులన్నవి తాము వదలు వంచి రామ ధనువులైనామని
బండలన్నవి రామ పాదధూలిచే ప్రాణమొందినామని
పుడమి అన్నది భూజాతనొసగి కళ్యాణము చేసినానని
ఇవి అన్నీ అదుగుతున్నవి మీరేమి చేసినారని
మనుషులగని మీరేమి చేసినారని

పడవలన్నివి రామభద్రునే గంగను దాతించినమని
పదుకన్నది పదునాలగువత్సరాలు రాజ్యమెలినమని
పక్షులన్నవి పదతి జాడ తెలిపినది మేమెనని

ఫలములన్నివి రాముని పెదవులకే తీపిని అందినించినమని
కొతులన్నవి కొందంత సాయం మాదేనని
ఉడుతలన్నవి కడలికి వంతెన కట్టినామని
ఇవి అన్నీ అదుగుతున్నవి మీరేమి చేసినారని
మనుషులగని మీరేమి చేసినారని
ఎంత నోము నోచినాము మేమని
మనుషులకంటే తామంతోఇంతో నయమని
పెదవి విప్పి పలికినవి కొన్ని
తమ మదిలోని మాటలన్నీ

Sreeramaganalahari - 5

Another short song :

నీల మేఘశ్యాముడు నా మ్రోల నిలిచెను
కాలమెల్ల తనలో దాచు లీల మెరిశెను
రాముడు నీల మేఘశ్యాముడు నా మ్రోల నిలిచెను

నెమలులన్ని పురిని విప్పి ప్రమద నాట్యమాడెను
వానకారు అవేళలో వచ్చినట్టు తోచెను
మరీ మరీ మబ్బులలో మసులతచేత
సూర్యుడే నీలమయి సొగసించెనా
రవిని పదె పదె మూసి వెయు ఫలితముగ
జనకమె ఇహకులమున జనియించెనా

నీల మేఘశ్యాముడు నా మ్రోల నిలిచెను
కాలమెల్ల తనలో దాచు లీల మెరిశెను
రాముడు నీల మేఘశ్యాముడు నా మ్రోల నిలిచెను

Excuse me for any typos but this is what I hear and wrote :)

Sreeraamagaana lahari -4

Another nice song from Sreerama gaana lahari

ఈ పాట వినుమయ్య రామా
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమా
ఈ పాట వినుమయ్య రామా
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమ
అసంకల్పముగా అంతరంగమే
ఆలపించు సంగీతమే సుమా
త్యాగరాజ రాగమృతమెరుగను
రామదాస రసకీర్తన తెలియను
ప్రాణ పంచకము ప్రణవము పలుకగ
పరవశమంది పాడుచుంటుని

రాగము కందని అనురగముతో
తాళము కందని తపోధ్యానముతో
శృతికందని విశృత భక్తితో
గద్గద కంఠము గానము చేశే

ఈ పాట వినుమయ్య రామ
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమా
ఈ పాట వినుమయ్య రామ
మదిలో అశలు తెలుపుట కొరకు
హృదయమందిన గీతము కాదు
క్షణమైనా నా కృతిని వినుట కన్న
నేనాశించు బ్రహ్మానందము లెదు

ఈ పాట వినుమయ్య రామ
ఇది ఏ పాటిదైన ఇలవంశసోమా
ఈ పాట వినుమయ్య రామ
ఈ పాట వినుమయ్య రామ

Tuesday, January 13, 2009

Sree rama gaana lahari 3

Another nice song from the same album

"శ్రీరామచంద్రుడే మా తండ్రి
సీతమ్మవారే మా తల్లి
శ్రీరామచంద్రుడే మా తండ్రిసీతమ్మవారే మా తల్లి
ఏ వేళనైన మాకు ఇంత అండ ఉండగా
ఏ వేళనైన మాకు ఇంత అండ ఉండగా
బ్రతుకంతా పండగ
భయపడటం దండగ

భరత లక్ష్మణ శత్రుఙులు బంధువు మాకు
విభీషణ సుగ్రీవులు స్నేహితులు
ఆంజయేయుడే మాకు ఆదర్శ భక్తుడు
గుహుడేమో మాకు ఆత్మీయుడు

సత్య ధర్మాలు మాకు సాయం చేశేను
ఓర్పు ఓదార్పు మ వెంటనుండేను
శాంతి ప్రేమ అహింసల సాధన మానం
ఆడి తప్పకుండుటే ఆరవ ప్రాణం,మా ఆరవ ప్రాణం

రామ నామమే మాకు రక్ష
శ్రీ రామ కథను పాడుటే దీక్ష
ఒక మాట
ఒక పత్ని
ఒక బాణం
ఒక మాట ఒక పత్నిఒక బాణం అని ఆచరించు ఆదర్శమేనీ ఆదర్శమే ..మా అందరికీ శ్రీరామ రక్ష
శ్రీరామచంద్రుడే మా తండ్రి
సీతమ్మవారే మా తల్లి"

Thursday, January 1, 2009

Sree rama gaana lahari - Song 2

Another song from Sree rama gaana lahari...A song where the singer is waiting for him..(Rama) and expresses the way she imagines that every sound that she hears is him....and then when she finds it isn't him...she expresses her disappointment...I just don't know how to express what I feel about these lyrics, music and how it is sung.

"అంతదవుల నుండి కడువింతగని అడుగుల సడి
ఎపుడో వినిపించే రామాఎంతకు అరుదెంచవేమి గుణధామా"

"అది నీ పద ధ్వనియేనా
మదిలోపల ఉదయించిన మధుర భ్రమయేనా
అది నీ పద ధ్వనియేనా
మరి మదిలోపల ఉదయించిన మధుర భ్రమయేనా
అలనల్లన చిరుగాలికి ఆకుల అలజడియేనా
గులక రాళ్ళ పై నడిచే సెలయేటి అలికిడియేనా..."

Wow..Lyrics ని మెచ్చుకోవాలో లేకా ఆ lyrics లో ఉన్న ఆ సున్నిత భావాన్ని అంత గొప్పగా మలిచిన ఆ సంగీతాన్ని మెచ్చుకోవాలో లెకా అంత అందం పాడిన వారిని మెచ్చుకోవాలో మరి..."గులక రాళ్ళ పై నడిచే సెలయేటి అలికిడియేనా..."అని పాడినా తీరు చూడండి...ఎంత disappointment ని ఇట్టే పలికించేసారు...

"అంతదవుల నుండి కడువింతగని అడుగుల సడి
ఎపుడో వినిపించే రామాఎంతకు అరుదెంచవేమి గుణధామా"

ఎంత ఆర్తిగా పాడారో...

"ఆగలేని గంగవోలే అశ్రుధార పొంగేనూ
ఆగలేని గంగవోలే అశ్రుధార పొంగేనూ
ఇక నిను గానక పుడమి పైన నిమిషమైన నిలువలేనూ
నా కనుపాపల ఉండి నల్లనవైతివ దేవా
నా కనుపాపల ఉండి నల్లనవైతివ దేవా
నా ఎదుట నిలిచి నీ కన్నుల నన్ను కరగనీయవా"

రాముడి complexion గురించి ఆ పోలిక చూడండి..."నా కనుపాపల ఉండి నల్లనవైతివ దేవా..." Wow...

"అంతదవుల నుండి కడువింతగని అడుగుల సడి
ఎపుడో వినిపించే రామాఎంతకు అరుదెంచవేమి గుణధామా"

ఎంత సున్నితంగా ఉంది ఈ పాట..What do I even say about this song too...So dear to me !!

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP